In Telangana: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో దక్కింది గాడిద గుడ్డు అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై “బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే..కేంద్ర బడ్జెట్ లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు” అంటూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లు చర్చనీయాంశంగా మారాయి.