నల్గొండ ‘కారు’ స్టీరింగ్ ఎవరికో..?

నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు టికెట్‌ భయం పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు తప్పదని తేలడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మరోసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ కన్ఫార్మ్‌ చేసిన ఆశావాహులు మాత్రం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వామపక్షాల
అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో జిల్లా టీఆర్ఎస్ టికెట్ ఎవరికీ దక్కుతుందాన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.


మరోవైపు జిల్లా పట్టణ ప్రెసిడెంట్‌, వార్డ్‌ కౌన్సిలర్‌ పిల్లి రామారాజు.. ఎక్కడ ఏ చిన్న కార్యం జరిగినా హాజరవుతూ ఆర్థిక సహాయం చేసి భరోసా కల్పిస్తున్నాడు.కొద్దిరోజుల ముందు వినాయక చవితికి ఉచితంగా దాదాపు 1000 పైగా గణేష్‌ విగ్రహాలను పంపిణి చేసినట్లు తెలిసింది.గతంలో ఎమ్మెల్యేగా గెలవక ముందు భూపాల్‌ రెడ్డి ఇదే తరహాలో విగ్రహాల పంపిణితో జనాలు ఇమేజ్‌ సంపాదించుకున్నారు.ఇప్పుడు రామరాజు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలోవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బీసీ కార్డ్‌ వాడుతూ.. ఆ వర్గ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాక దీపావళి,దసరా పండుగలకు కూడా ఇదే రకమైన తాయిలాలు ఇచ్చినట్లు తెలిసింది.

అటు నియోజకవర్గ సీనియర్‌ నేత గుత్తా సుఖేందర్‌ సైతం తన కుమారుడు అమిత్‌ ను..రానున్న ఎన్నికల్లో పోటిచేయించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే గుత్తా ట్రస్ట్‌ పేరుతో పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. .అయితే అవి మూన్నాళ్ల  ముచ్చటకే పరిమితమని వినిపిస్తోంది. దీనికి తోడు ఆశావాహులు అధిక స్థాయిలో ఉండటంతో ఆయనకు టికెట్‌ కష్టమేనన్న చర్చ టీఆర్‌ఎస్‌ లో జరుగుతోంది.

ఇదిలా ఉంటే..మరికొంత మంది కూడా టికెట్‌ రేసులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.ఉద్యమకారుడు చకిలం అనిల్‌ , చాడ కిషన్‌ రెడ్డి.. మున్సిపల్‌ చైర్మన్‌ మందండి సైదిరెడ్డితో పాటు తదితరులు పేర్లు టికెట్‌ రేసులో వినిపిస్తున్నాయి. ఓవైపు వామపక్షాల ఒత్తిడి ..మరోవైపు పార్టీ ఆశావాహుల అంతర్గత పోరుతో టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Optimized by Optimole