Newsminute24

మర్రి చెన్నారెడ్డి ‘మంత్రదండం’ ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు!

Nancharaiah merugumala senior journalist: (మర్రి చెన్నారెడ్డి చేతిలోని ‘మంత్రదండం’ వరుసగా ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు (1978-80, 1989-90) పనిచేసిన మర్రి చెన్నారెడ్డికి కూడా అనేక నమ్మకాలుండేవి. ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు  ఆయన చేతిలో ఓ మంత్రదండం వంటి చేతికర్ర కనిపించేది. ఆ అప్రకటిత ‘రాజదండం’పై మీడియాలో, బయటా అనేక కతలు చెప్పేవారు. అయితే సీఎం అయిన మొదటిసారి చెన్నారెడ్డి గారు పదవిలో ఉన్నది రెండు సంవత్సరాల ఏడూ నెలలు. చివరి, రెండోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ప్రధాని పదవి పోయాక ముఖ్యమంత్రి అయ్యారు ‘చందా రెడ్డిగా’ ప్రతిపక్షాల ముద్దరేసిన చెన్నారెడ్డి. ఈసారి సరిగ్గా ఏడాది నిండిన నెల లోపే ఆయన సీఎం పదవి కోల్పోయారు. వరుసగా ఐదేళ్లు ఏపీ ముఖ్యమంత్రి పీఠంపై కూసోవడానికి ఉపయోగపడని ఈ పన్నుగర్ర ఇతరత్రా ఆయనకు ఎంతగా మేలు చేసిందో ఆయన చిన్న కొడుకు మర్రి శశిధర్ రెడ్డి గారే చెప్పాలి.

Exit mobile version