అన్న ఒడిలో తమ్ముడి మృతదేహం.. వీడియో వైరల్!

ఓతండ్రి కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈవిషాద ఘటన వింటే ప్రతి ఒక్కరి చలిస్తారు. ఇంతకు హృదయవిచారక ఘటన వెనక దాగున్న కథ ఏంటి? ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం!

మధ్యప్రదేశ్ లోని మురైనా జిల్లా అంబాహ్‌ మండలం బడ్‌ఫరా గ్రామానికి చెందిన పూజారామ్‌ జాటవ్‌కు నలుగురు పిల్లలు. మనస్పర్థలు రావడంతో..కొద్ది నెలల క్రితం భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది.ఈనేపథ్యంలో రెండేళ్ల చిన్న కుమారుడు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో పూజారామ్.. బాలుడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. వారిని స్వగ్రామం నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చిన అంబులెన్స్‌ అప్పటికే వెళ్లిపోయింది. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సరిపడా డబ్బులు లేక పూజారామ్‌ పడుతున్న ఇబ్బందులు.. తన ఒడిలో తమ్ముడి మృతదేహంతో అంబులెన్స్ కోసం ఎదురుస్తున్న అన్నయ్య వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.