కుప్పం: కుప్పంలో నారా లోకేష్ ‘ యువ గళం ‘ పాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా సాగింది. యాత్రకు మద్దతుగా.. రైతులు, విద్యార్దులు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన టొమాటో లు రోడ్ల మీద పారబోసే పరిస్థితి దాపురించందన్నారు.ఎరువులు ధరలు పెరిగిపోయాయి..డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ఎత్తేసారు.. దొంగ విత్తనాల తో నష్టపోతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కోర్టులో దొంగతనం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి.. సీబీఐ చుట్టూ తిరుగుతూ రైతుల్ని మరిచిపోయాడేమోని లోకేష్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు సాయంతో నడవగలుగుతున్నా: తేజ
కుప్పం రెండో రోజు పాదయాత్రలో మనసు హత్తుకునే సన్నివేశం చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం మొరసన పల్లి గ్రామ యువకుడు తేజ రోడ్డుప్రమాదంతో మంచంపట్టాడు. అప్పటి సీఎం చంద్రబాబు రూ.16లక్షల వైద్యం సాయం చేశాడు. ఈ క్రమంలో పాదయాత్ర గురించి తెలుసుకున్న తేజ..లోకేష్ ను కలిసి కృతజ్ఞత తెలిపాడు. వెంటనే అధైర్యపడొద్దు మేమున్నామంటూ లోకేష్ హత్తుకోవడంతో.. తేజ ఆనందభాష్పాలు రాల్చాడు. ఏమిచ్చి చంద్రబాబు రుణం తీర్చుకోగలనంటూ సదరు యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు.