Site icon Newsminute24

భార్యను గెలిపించుకోవాలని ఉత్తమ్ నయా స్కెచ్..

(nancharaiah merugumala senior journalist): గొల్ల మల్లయ్యను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక డెప్యూటీ సీఎం డీకే శివకుమార్, ‘సరిహద్దు నేత’ రఘువీరారెడ్డిని కోదాడ  రప్పించిన ఉత్తమ్‌ రెడ్డి నిజంగా గ్రేట్‌!

బీఆరెస్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రా పీసీసీ మాజీ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌ రఘువీరారెడ్డిని  శుక్రవారం కోదాడ రప్పించారు నలమాడ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. పక్కనున్న హుజూర్‌ నగర్‌ నుంచి పోటీచేస్తున్న అప్రకటిత సీఎం అభ్యర్థి కెప్టెన్‌ ఉత్తమ్‌– ఈసారి భార్యతో కలిసి తెలంగాణ అసెంబ్లీకి వెళ్లాలన్న కల ఏమవుతుందో? 2018లో కేవలం 600 ఓట్ల తేడాతో గొల్ల మల్లయ్య చేతిలో ఓడిన పద్మావతిని (శివకుమార్‌ చెప్పినట్టు) ఈసారి పాతిక వేల మెజారిటీతో గెలిపించడానికి కర్ణాటక సరిహద్దు గ్రామం నీలకంఠాపురం నుంచి రఘువీరారెడ్డి యాదవ్‌ గారిని రప్పించకతప్పదని ఉత్తమ్‌ కుమారుడికి తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు చెప్పారేమో మరి. కన్నడ నగరం బళ్లారికి చెందిన తెలుగు కుటుంబంలో పుట్టిన కనుగోలు ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కన్నడ రంగు బాగానే పులుముతున్నారు. కొత్తగూడెం నుంచి సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావును అసెంబ్లీకి పంపడానికి ‘అనుమతించిన’ సునీల్‌ కనుగోలు– పాలేరు నుంచి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు శాసనసభకు పోవడానికి దారిలేదని చెప్పడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్‌ మొల వరకూ మునిగిపోవడానికి బాగానే తోడ్పడుతున్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ రెడ్డి నేత ఎవరూ ముఖ్యమంత్రి కాకుండా చేసింది కమ్మ ఎన్నికల నిపుణుడేనని భవిష్యత్తులో నిందిస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు.

https://youtube.com/shorts/MmxUWu17QrE?si=u5eteDNoO_ex59bXhttps://youtube.com/shorts/MmxUWu17QrE?si=u5eteDNoO_ex59bX

Exit mobile version