‘ విరూపాక్ష’ మూవీ రివ్యూ..!

సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా న‌టించిన చిత్రం ‘ విరూపాక్ష’. భీమ్లానాయ‌క్ ఫేం సంయుక్త మీన‌న్ క‌థానాయిక‌. క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ శ్రీవెంక‌టేశ్వ‌ర్‌, సుకుమార్ ప‌తాకాల‌పై బాపినీడు సమర్పణలో బీవిఎస్ఎన్  ప్ర‌సాద్ చిత్రాన్ని నిర్మించారు. వ‌రుస ప్లాపుల‌తో నిరాశ‌లో ఉన్న సాయితేజ్.. విరూపాక్ష పై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈసినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం!

కథ :

రుద్ర‌వ‌నం అనే ఊరిలో క్షుద్ర‌పూజ‌లు చేస్తున్నార‌ని ఓకుటుంబాన్ని చంపేస్తారు. ఈక్ర‌మంలోనే అమ్మ‌వారి జాత‌ర ఉండ‌టంతో త‌ల్లితో క‌లిసి ఆ ఊరోస్తాడు సూర్య‌(సాయితేజ్‌). ఊరి స‌ర్పంచ్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్(రాజీవ్ క‌న‌కాల‌) కూత‌రు నందిని(సంయుక్త‌మీన‌న్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఊరి నుంచి సూర్య‌  వెళ్లేపోయే క్ర‌మంలో అమ్మ‌వారి గుడిలో ఓ వ్య‌క్తి మ‌ర‌ణిస్తాడు. ఆత‌ర్వాత ఒక‌రి త‌ర్వాత మరోక‌రు.. వ‌రుస‌గా న‌లుగురు మ‌ర‌ణిస్తారు.  దీంతో ఆల‌య పూజారి మ‌ర‌ణాల‌ను ఆప‌డానికి నందిని స‌జీవ‌ద‌హ‌న‌మే ఏకైక ప‌రిష్కార మార్గ‌మ‌ని చెబుతాడు. ఇంత‌కు మ‌ర‌ణాలు వెన‌క దాగున్న మిస్ట‌రీ ఏంటి?  ఈస‌మ‌స్య నుంచి ప్రేమించిన  నందినిని సూర్య ఎలా కాపాడాడు? చివ‌ర‌కు ఏంజ‌రిగింది?  తెలియాలంటే వెండితెర‌పై సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే?

హ‌ర‌ర్, యాక్ష‌న్ నేప‌థ్యంలో విరూపాక్ష తెర‌కెక్కింది .  కథనం పరంగా సినిమా ఫ‌స్ట్ ఆఫ్ నుంచి చివ‌రి వ‌ర‌కు  ప్రేక్ష‌కుడికి ఎక్క‌డా  బోర్ కొట్ట‌దు.  క‌థ‌కు త‌గ్గ‌ట్టు సినిమా చూస్తున్నంత సేపు నెక్ట్స్ ఏంజ‌రుగుతుందా? అనే ఉత్కంఠను చివ‌ర‌కు వ‌ర‌కు మెయింటెన్ చేయ‌డంలో సుకుమార్ స్టైల్ క‌నిపించింది. హీరో, హీరోయిన్ ల‌వ్ ట్రాక్ అంత ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. ఫ‌స్ట్ ఆఫ్ ఓకే అయిన‌ప్ప‌టికీ.. సెకాండాఫ్ లో వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు ఇంకాబెట‌ర్ గా ఉంటే బాగుండేది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది. 

ఎవరెలా చేశారంటే?

హీరో సాయితేజ్ న‌ట‌న బాగుంది. గ‌త చిత్రాల కంటే భిన్నంగా సూర్య పాత్ర‌లో త‌న‌దైన యాక్టింగ్ తో  అద‌ర‌గొట్టాడు. హీరోయిన్ సంయుక్త మీన‌న్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. కొన్ని స‌న్నివేశాల్లో ఆమె న‌ట‌న నెక్ట్స్ లెవ‌ల్.  ప్రాధాన్య‌మున్న పాత్రలో నటించిన రాజీవ్ కనకాల పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మిగిలిన న‌టీన‌టులు పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ద‌ర్శ‌కుడిగా  తొలిచిత్ర‌మే అయినా  .. చెప్పాల‌నుకున్న క‌థ‌ను తెర‌పై అద్భుతంగా ప్ర‌జెంట్ చేశాడు  కార్తీక్. క‌థ‌కు త‌గ్గ‌ట్టు పాత్ర‌ల ఎంపిక‌లోనే  ద‌ర్శ‌కుడి ఫ‌స్ట్ స‌క్సెస్ సాధించాడ‌ని చెప్ప‌వ‌చ్చు.  స్క్రీన్ ప్లే సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌. అజ‌నీష్ లోక్ నాథ్ సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలెట్‌. నిర్మాణ‌విలువలు బాగున్నాయి.

 చివరగా స‌రికొత్త మిస్ట‌రీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

రివ్యూ: 3/5 

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole