మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘పవర్ ‘ డైరెక్టర్ బాబీ చిత్రానికి దర్శకుడు. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.సంక్రాంతి కానుకగా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ ఆచార్య ‘ డిజాస్టర్ తో నిరాశలో ఉన్న మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలు నెరవేరాయా? లేక అడియాశలేనా? తెలుసుకుందాం!
కథ:
వీరయ్య (చిరంజీవి) పోర్టులో ఐస్ ఫ్యాక్టరీ నడుపుతుంటాడు. ఓ కేసు విషయమై సస్పెండ్ అయిన పోలీసు సీతాపతితో పరిచయం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే శృతిహాసన్ తో లవ్ ట్రాక్ నడుపుతాడు. ఇంతలో సీన్లోకి చిన్నపుడే దూరమైన సవతి తల్లి కొడుకు విక్రమ్ సాగర్(రవితేజ) ఎంట్రీ ఇస్తాడు. రావడంతోనే వీరయ్యను అరెస్టు చేస్తాడు. అసలు సీతాపతి- వీరయ్యకు సంబంధం ఏంటి? విక్రమ్ సాగర్ అన్నయ్య వీరయ్యను ఎందుకు అరెస్ట్ చేశాడు? సీతాపతి సస్పెండ్ కావడానికి కారణం ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..?
ఎప్పటిలానే మెగాస్టార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చాలా రోజుల తర్వాత కామెడీ టైమింగ్ తో అభిమానుల్ని అలరించాడు. శృతిహాసన్ తో లవ్ ట్రాక్ సీన్స్ అదరగొట్టాడు. హీరోయిన్ సైతం ఉన్నంత సేపు పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఇక రవితేజ ఎంట్రీతో సినిమా మరో లెవల్ కి వెళ్లింది. మాస్ మహారాజా పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఇరగదీశాడు.సినిమాకు ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ ఎసెట్ అని చెప్పవచ్చు. క్యాథరిన్ నటన కూడా ఫర్వాలేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు..
దర్శకుడు బాబీ చెప్పాలనుకున్న కథను ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే భావించవచ్చు. సెకండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ విసుగు తెప్పించిన.. కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుమ్మేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మొత్తంగా ఫస్ట్ ఆఫ్ ఫర్వాలేదు.. సెకండ్ ఆఫ్ ఒకే అనే చెప్పవచ్చు.
రేటింగ్: 3/5(సమీక్ష ప్రేక్షకుడి కోణంలో ఇవ్వబడింది)