హిందు పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామాలకు ప్రత్యేకత ఉంది.మహ భారతంలో ఉన్నట్లు భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు కృష్ణుడు, ధర్మరాజుతో సహా అందరూ శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసుకోలేదు.అత్యంత పవిత్రమైన విష్ణు సహస్రనామం మరి మనకెలా చేరింది? దీని వెనకు దాగున్న కథేటంటే?
శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని 1940 లో ఓవ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు.ఈక్రమంలోనే అక్కడున్న టేప్ రికార్డర్ చూపించి స్వామి వారు ఆ వ్యక్తిని.. అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, “ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది?” అని కుశల ప్రశ్న వేశారు. ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, “విష్ణు సహస్రనామం మనకెలా అందింది? అని మరో ప్రశ్న అడిగారు.ఇందుకు బదులుగా ఓవ్యక్తి భీష్ముడందించారన్నారని జవాబిచ్చారు.వెంటనే స్వామివారు మరి “భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?” అని అడగగా సమాధానం రాలేదు.
ఇక స్వామివారు విష్ణు సహస్రనామం వెనక ఉన్న కథను చెప్పడం మొదలెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ వ్రాసుకోలేదు.ఇంతలో యుధిష్టురుడు.. శ్రీకృష్ణుడిని శరణువేడుతూ .. కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి” అని వేడుకున్నారు. దీంతో మహవిష్ణువు స్వరూపుడైన కృష్ణుడన్నాడు.. “అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది” అని చెప్పుకొచ్చాడు.ఇదేలా సాధ్యమని అక్కడున్న వారందరూ అడిగారు.
మహేశ్వర స్వరూపం..
విష్ణు సహస్త్రనామాలను లిఖించడం కేవలం సహదేవుడి వల్లే సాధ్యమవుతుందని శ్రీకృష్ణభగవానుడి వివరణతో కూడిన జవాబిచ్చారు. ఎందుకంటే “మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడని.. ఈ స్పటికం మహేశ్వర స్వరూపమని.. దాని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుందని అన్నాడు. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి .. వ్యాస మహర్షితో సహస్త్రనామాలను వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. దీంతో స్వామి వారి ఆజ్ఞ మేరకు సహదేవుడు, వ్యాసమహర్షి కలిసి విష్ణు సహస్రనామాలు పూర్తి చేశారని స్వామి వారు సెలవిచ్చారు.