మహిళల ఆసియా కప్ టీ 20 విజేత భారత్..ఫైనల్లో శ్రీలంక ఘోర ఓటమి ..!!

మహిళల టీ 20 ఆసియా కప్ విజేతగా భారత్ అవతరించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. భారత బౌలర్ల ధాటికి 65 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఓపెనర్ స్మృతి మంధాన అర్థ సెంచరీతో చెలరేగడంతో హర్మన్ సేన్ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి 8వ సారి కప్ ను సొంతం చేసుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో 9వికెట్ల నష్టానికి 65పరుగులు చేసింది. ఆ జట్టులో ఇనోకు రణ్వీర్ , రణసింఘె మినహా మిగతా బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ ముడు.. స్నేహ రానా , రాజేశ్వరీగైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం చేధనలో టీమిండియా 8.3 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. జట్టులో ఓపెనర్ స్మృతి మంధనా హాఫ్ సెంచరీతో చెలరేగింది. లంక బౌలర్లలో రన్వీర, కవిష చెరో వికెట్ పడగొట్టారు.

 

 

You May Have Missed

Optimized by Optimole