ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక

స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక బ్రిస్బేన్ టెస్ట్ హీరోలు పంత్, సుందర్, గిల్, సిరాజ్, ఠాకూర్ లకు జట్టులో స్థానం లభించింది. స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు భరత్ కు జట్టులో చోటు దక్కింది.

భారత జట్టు : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ,మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాగూర్, శుభమన్ గిల్, అశ్విన్, వృద్ధిమాన్ సాహ, మయాంక్ అగర్వాల్, చటేశ్వర పుజారా, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్ర, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ ,భరత్.