రెండోసారి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై పలువురు ప్రముఖులు,క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టుకు 5 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 32 ఏళ్ల తరవాత గబ్బాలో ఆసీస్ పై విక్టరీ సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోడీ , కెప్టెన్ కోహ్లీ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు.
సంతోషాన్ని కలిగించింది- ప్రధాని మోదీ
భారత జట్టు సాధించిన విజయం అత్యంత సంతోషాన్ని కలిగించిందని.. ఆటగాళ్ల ఎనర్జీ సంకల్ప బలం గొప్పదని మోదీ కొనియాడారు.
మా సామర్ధ్యాన్ని శంకించిన వాళ్లకు చెంపపెట్టు- కోహ్లీ
టీం ఇండియా అద్భుత విజయంపై కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ ‘అడిలైడ్ టెస్ట్ తరవాత మా జట్టు సామర్ధ్యాన్ని శంకించిన వాళ్లకు ఈ విజయం చెంపపెట్టు లాంటిందని.. ఆటగాళ్లు చూపించిన తెగువ, సంకల్ప బలం గొప్పదని.. ఈ చారిత్రక విజయాన్ని ఆస్వాదించండి అంటూ కోహ్లీ ట్విట్ చేశాడు.
గొప్ప జట్టు.. అద్భుత విజయం- కేటిఆర్
టీం ఇండియా సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోయేదని.. 2021 గొప్పగా ప్రారంభించారని.. అద్భుత జట్టుతోపాటు అసాధారణ విజయం భారత జట్టు సాధించందని కేటీఆర్ ట్వీట్ చేశారు.