పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయం వాడీవేడిగా నడుస్తోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈజిల్లాలో..2019 ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. మొత్తం 15 స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోని.. ఇక్కడ హవా సాగించిన పార్టీదే సీఎం పీఠం సంప్రదాయం కొనసాగించింది. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహెరి పోరు జరిగితే.. రానున్న ఎన్నికల్లో మాత్రం ముక్కోణ పోటి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వేలోనూ ఆవిషయం తేటతెల్లమయ్యింది.ఇంతకు ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో లెట్స్ రీడ్ ఇట్…
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అన్న అంశంపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆధారంగా.. టీడీపీ 6 (ఆరు),వైసీపీ 5 (ఐదు) జనసేన 4 (నాలుగు) స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. ఒకవేళ టీడీపీ – జనసేన పొత్తు కుదిరితే క్లీన్ స్వీప్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆచంట, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకులో టీడీపీకి నేతలున్నా.. పార్టీకి, క్యాడర్ కి సంబంధం లేదు.మొత్తం15 స్థానాలకు గాను., ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులున్నా,, మిగతా 9 నియోజకవర్గాల్లో గ్రూపుల తగాదాలతో టీడీపీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులేస్తుంది. జనసేన- టీడీపీ పొత్తు కుదిరితే.. జనసేనకు 3 నుంచి 4 సీట్లు ఇచ్చే అవకాశం ఉండటంతో .. నేతలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.గత ఎన్నికల్లో జనసేప పార్టీ ఉమ్మడి ప.గో. జిల్లాలో మంచి ఓటింగ్ సాధించింది.
గత ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో వైసీపీ వేవ్ స్పష్టంగా కనిపించింది. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి నియోజకవర్గంలో గ్రూపు తగాదాలతో వైసీపీ సతమతమవుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, నియోజకవర్గ సమస్యలు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణంగా సర్వేలో తేటతెల్లమయ్యింది. సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్న వారి పనితీరులో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడంలేదన్నది సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్న సమాధానం.
టీడీపీ విషయానికొస్తే .. పలు నియోజకవర్గాల్లో ఆపార్టీకి అభ్యర్థులు కనిపించకపోయినా..ప్రభుత్వ వ్యతిరేకత వారికి కలిసొచ్చే అంశంగా సర్వే రిపొర్టు ఆధారంగా తెలుస్తోంది. జనసేన పొత్తు ఆపార్టీ నేతలను కలవరానికి గురిచేస్తుంది. ఒకవేళ పొత్తు కుదిరితే .. జిల్లాలో మంచి పట్టున్న జనసేనకు పలు నియోజకవర్గ సీట్లు అడిగే పరిస్థితి ఉండటంతో.. ఎటు తేల్చుకోలేక పచ్చ పార్టీ నేతలు సతమతమవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.