ఆర్. దిలీప్ రెడ్డి ( విశ్లేషకులు): డబ్బున్న వాళ్లంతా గొప్ప పనులు చేస్తారని చెప్పలేం. కానీ, నీతా అంబానీ 36 స్వచ్చంద సంస్థల సహకారంతో 19 వేల మంది బాలికలను ప్రత్యేక నీలి జెర్సీల్లో ముంబాయి లోని వాంకడే స్టేడియంకి రప్పించారు. అందులో 200 మంది వైవిధ్య సామర్థ్యాల దివ్యాంగులున్నారు. వారిలో దాదాపు అందరు, లేదా అత్యధికులు తొలిసారి స్టేడియంకి వచ్చి క్రికెట్ లైవ్ చూస్తున్నవాళ్లే ! స్టేడియం ఓ నాలుగ్గంటల పాటు నిజంగా ‘నీలి సంద్రమే’ అయింది. ఇటీవలే ముగిసిన మహిళా క్రికెట్ లీగ్ WPL లో వారిదే అయిన ‘ముంబయి ఇండియన్’ టీమ్ జెర్సీ అది. ‘రిలయన్స్ స్థాపకోత్సవాల’లో భాగంగా, అందరికీ విద్య, ఆటల దినోత్సవంగా ఓ ప్రత్యేక ‘ESA Day’ ని ఇలా స్టేడియం లోనే ఘనంగా జరిపించారు.
“ప్రతి ఆడపిల్లకీ…. కోరుకున్నట్టు చదువుకునే, ఆడుకునే అవకాశం లభించి, వారూ సమున్నతంగా ఎదగాలన్నదే అభిలాష” అని మ్యాచ్ జరిగేప్పుడే రవిశాస్త్రికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నీతా అన్నారు. అభినందనీయం.
( NOTE: ఫోటోలన్నీ టీవీ చూస్తూ మొబైల్ తో నేను గ్రాబ్ చేసినవే)
పిల్లలెంత సంబూరపడ్డారో! ఆదివారం నాటి IPL తాజా ఎడిషన్ మ్యాచ్ కూడా అంతే రక్తి కట్టింది. అంత మంది పూబాలల కేరింతలు, చప్పట్ల నడుమ…. ఇంకో రెండు ఓవర్లు ఉండగానే 5 వికెట్ల తేడాతో Mumbai India జట్టు Kolkata Knight Riders టీమ్ పైన ఘన విజయం సాధించింది.
PS: గొప్ప పనులకెపుడూ గొప్ప ముగింపే ఉంటుంది కద!