కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎపిసిసి వినూత్న కార్యక్రమం..

విజయవాడ: కర్ణాటక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో…కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు  గిడుగు రుద్ర రాజు..ఆంధ్ర నుండి బెంగళూరు వెళ్లే బస్సులలో ట్రైన్లలో కరపత్రాలు పంచుతూ హస్తం పార్టీ గెలుపును కృషి చేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. బెంగళూరుకు వెళ్లే తెలుగువారికి కాంగ్రెస్ పార్టీ రావలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఆయన పంపిణీ చేసిన కరపత్రాలు సోషల్ మీడియాలో హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారాయి.

కాగా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బిజెపిని ఓడించాలని రుద్రరాజు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చక పోవడమే కాక అన్ని రంగాల్లో కేంద్రం చూపిస్తున్న వివక్షతను ఎండగట్టాలని రుద్రరాజు సూచించారు.

You May Have Missed

Optimized by Optimole