విజయ్ సర్కార్ పై మోడీ ఆగ్రహం!

శబరిమల వ్యవహారంలో ఎల్ డిఎఫ్ ప్రభుత్వ తీరు పట్ల  ప్రధాని మోదీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. అమాయకులైన భక్తులపై లాఠీ చార్జ్ చేస్తారా అని  ప్రశ్నించారు. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధరన్ పోటీచేస్తున్న పలక్కడ్ నియోజకవర్గంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సంందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని వెండి నాణేల కోసం జీసస్కు జూడాస్ ఇస్కారియట్ ద్రోహం చేసినట్లే.. బంగారు ముక్కల కోసం ప్రజలను విజయ్ ప్రభుత్వం ద్రోహం చేసిందని మోదీ విమర్శించారు. ఎల్ డీఎఫ్- యుడిఎఫ్  మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ఈ ఫిక్సింగ్ ను బీజేపీ బట్టబయలు  చేసిందన్నారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole