CPM: ప్రమాదకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలి: సిపిఎం మండల పార్టీ

Atmakur : ఆత్మకూర్ మండలం సిపిఎం పార్టీ  పోరుబాట పట్టింది. తుక్కాపురం నుండి రహీంఖాన్ పేట్ వరకు ప్రమాదకరంగా ఉన్న కంకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా  పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం మాట్లాడుతూ… నిత్యం మోత్కూర్ నుంచి హైద్రాబాద్ కి వెళ్లే  వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుందని.. గుంతల వలయాల రోడ్డుతో  ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సంవత్సరం నుండి ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆర్ అండ్ బీ అధికారులు తక్షణమే గుంటను పూడ్చాలని , బీటి రోడ్డు వేయాలని కోరారు. గత సంవత్సర కాలంగా రహీంఖాన్ పెట్-తుక్కాపురం రోడ్డు నిర్మాణ పనుల జాప్యంతో చాలామందికి ప్రమాదాలు జరిగాయని, కాని ఇప్పటికి రోడ్డు పనులు పూర్తి కాలేదని దీనికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రమాదకరంగా ఉన్న గుంటలను పూడ్చటంతో పాటు రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా రహీం ఖాన్ పేట స్టేజి వద్ద బస్సులు ఆపాలని, యాదగిరిగుట్ట డిపో, తొర్రూర్ డిపో మేనేజర్లకు వినతి పత్రం ద్వారా విన్నవించుకున్న
అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని.. ఇప్పటికైనా అధికారులు  సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని.. లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి, కలవల రమేష్, కన్నె బోయిన ఐలయ్య, జె సత్యం, కేశవులు, సామ వెంకటరెడ్డి, (సిఐటియు మండల కన్వీనర్) బడికే ఐలయ్య, వేపూరి బుగ్గ రాములు,తదితరులు పాల్గొన్నారు.

 

More From Author

Actress: కుందనపు బొమ్మ అందాలు..