కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై దాడికి నిరసనగా నేతల నిరసనలు..

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే నియోజకవర్గంలో వేల కోట్లు చేశారని.. అయినప్పటికి నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ వెంట ఉన్నారనే నేపంతోనే దాడులకు దిగుతున్నారని మండిపడుతున్నారు.
మరోవైపు బీజేపీ ముఖ్యనేతలు ప్రచారంలో భాగంగా అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపును కేంద్ర అగ్ర నాయకత్వం సీరియస్ తీసుకుందని బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఇక్కడ గెలిచి అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగానే బీజేపీ ముఖ్యనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికలకు గడువు వారం రోజులే ఉండటంతో కేంద్ర మంత్రులు సైతం ప్రచారానికి వస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి మాజీమంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే నియోజకవర్గమంత కలియతిరగడం.. సానూభూతి ఉండటంతో గెలుపు లాంఛన ప్రాయమే అనే బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole