తనను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టాడని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడి మల్కాపూర్, కోతులాపురం, అల్లందేవి చెరువు, సర్వేలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. కాంగ్రెస్ గిరిజనులకు పట్టాలిస్తే.. కేసీఆర్ ఆ భూములు గుంజుకున్నాడని రేవంత్ మండిపడ్డారు. టీఆరెస్ పాలనలో మునుగొడులో గ్రామాలకు సరైన రోడ్లు కూడా వేయలేదని.. అలాంటి వారు ఇక్కడ అభివృద్ధి ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.ఈ ప్రాంతానికి ఏమీ చేయని వారికి ఓట్లు అడిగే హక్కు లేదని రేవంత్ తేల్చిచెప్పారు.
కాగా పేదలు, నిరుద్యోగుల కోసం అవసరమైతే వందసార్లు జైలుకు వెళ్లాడానికైనా తాను సిద్ధమన్నారు రేవంత్. తానేమీ దొంగతనం చేసి జైలుకు పోలేదని.. పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లానని సమాధానమిచ్చారు.తాను తిన్న చిప్పకూడు సాక్షిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ ప్రతిజ్ఞ చేశారు.