Sambashiva Rao:
===========
తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. అక్కగా, తల్లిగా తన శైలిలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి, తన కూతురుతో కలిసి చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సురేఖ వాణి సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది. గతంలో ఎక్కువగా సినిమాల్లో నటింంచిన ఈమె.. ఈమధ్య అడపదడప ఒకటో రెండో సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఒక దశలో సురేఖ సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుందని టాక్ కూడా వచ్చింది.
ఇదిలా ఉండగా.. ఇటీవలె సురేఖవాణి స్వాతిముత్యం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో పాల్గొంది. అయితే సినిమాలకు దూరం కావడంపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా కాస్త భావోద్వేగంతో మాట్లాడిన ఆమె..నేను సినిమాలు మానేశాను అని అనుకుంటున్నారు. ‘చాలామంది సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు. మంచి ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తా. అసలు సినిమాలు మాదాకా వస్తే కదా చేయడానికి అంటూ సురేఖ వాణి ఎమోషనల్ గా మాట్లాడింది. ఈ సందర్భంగా స్వాతిముత్యంలో తనకు మంచి రోల్ ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపింది.