Sambashiva Rao:
==========
Monkey: మందుబాటిల్ కనిపిస్తే ఎక్కడ లేని హుషారు వస్తుంది. ఎరిచేతుల్లోనైనా బాటిల్ కనిపిస్తే లాగేసుకుంటుంది. తాగుతుంది, తూగుతుంది, చిందులేస్తుంది. చుక్కనోట్లోకి పోకపోతే శివాలెత్తుతుంది. బాటిల్ ఎవరైనా ఇస్తే.. ఓకే లేదంటే నేరుగా దుకాణాల్లోకి చొరబడి మందు బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోంది. చుక్కేసి గాని ఆరోజు నిద్రపోదు. ఇంతకి ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా. ఎవరో కాదు వానరం గురించి. అవును మీరు విన్నది నిజమే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కోతి వార్తల్లోకి ఎక్కింది.
రాయ్‌బరేలీ జిల్లాలో మద్యానికి అలవాటు పడిన వానరం దుకాణల్లోకి దూరి మరి మద్యం ఎత్తుకెళ్లిపోతోందంటూ అమ్మకందారులు ఫిర్యాదు చేశారు. మద్యం తాగుతూ ఎవరైనా కనిపిస్తే వాబరి దగ్గర నుంచి లాక్కుని పారిపోతోందని స్థానికులు వెల్లడించారు. మద్యం విక్రేతలు అడ్డుకోవాలని చూస్తే.. వారిపై దాడి చేస్తుందని భయపడిపోతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులతో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆ తాగుబోతు కోతికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కోడుతుంది.
रायबरेली में बंदर का शराब पीने का वीडियो हुआ वायरल जो शराब की दुकान में आने वाले लोगो से शराब छीन लेता है और गटक जाता है। pic.twitter.com/We8qaAY4pi
— Anurag Mishra (@AnuragM27306258) October 30, 2022