దళితుడి పై టిఆర్ఎస్ మహిళ సర్పంచ్ చెప్పుతో దాడి..!!

తెలంగాణాలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్.. దళితుడిపై చెప్పుతో దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ ఘటన వెనక కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

ఇక విషయానికొస్తే..నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామంలో అర్హులకు.. ప్రభుత్వం దళిత బందు పథకం కింద నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో విషయం తెలిసిన టీఆర్ఎస్ మహిళ సర్పంచ్ సరితా రెడ్డి.. దళిత బందులో వాటా ఇవ్వలేదని స్థానిక దళితుడిని చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అటు మహిళ సర్పంచ్ తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు.అధికారం మత్తులో కళ్లు మూసుకుపోయి దాడులు దిగడం అన్యాయమని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.టీఆర్ఎస్ నేతల ఆగడాలను అరి కట్టాలంటే..తిరగబడాలని పిలుపిచ్చారు.

అటు ఈ వీడియోపై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అధికార దర్పంతో టిఆర్ఎస్ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. టీఆర్ఎస్ నేతలకు దళితులు అంటే చిన్న చూపని మరో నెటిజన్ క్యాప్షన్ జోడించాడు. అధికార పార్టీ నేతల బలుపు దిగాలంటే కరెక్ట్ కేసులు పెట్టి ఈ అహంబావినీ జైల్లో పెట్టేందుకు బాధిత దళితులు నిక్కచ్చిగా నిలబడాలని ఇంకొకరు కామెంట్ జోడించాడు.

Optimized by Optimole