నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా .. లైంగిక వేధింపుల ద్వారా మోసపోయిన మహిళలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తక్షణ ఆర్థిక సహాయం అందజేశామన్నారు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. బాధిత మహిళలకు భరోసా సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.పోలీసు భరోసా సెంటర్, షీ టీమ్స్ .. ప్రజలకు, బాధితులకు అందించవలసిన సేవల గురించి వివరించిన ఎస్పీ.. 10 మంది మహిళ బాధితులకు.. ఆర్ధిక సహాయాన్ని భరోసా కేంద్రం నుండి అందించడం జరిగిందన్నారు. బాధిత మహిళలకు పోలీస్ శాఖ ఎళ్ల వేళలా అండగా ఉంటుందని ఎస్పీ రెమా రాజేశ్వరి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్ రావు షి టీమ్ ఇంచార్గ్ సి. ఐ రాజశేఖర్ గౌడ్, ఉమెన్ ఏ.యస్. ఐ ఆబెదా బరోసా సెంటర్ కోఆర్డినేటర్ నళిని పాల్గొన్నారు.