లోకేష్ ‘ యువగళం ‘ క్రేజ్ పీక్స్.. మేము సైతం అంటూ ‘ యువత ‘..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘ యువగళం’ పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. ధ్వంస‌మైన ఆంధ్రప్రదేశ్ పున‌ర్మిర్మాణమే ల‌క్ష్యంగా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలో మీటర్ల మేర యాత్ర జరగనుంది. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా మధ్య మధ్యలో రోడ్ షో..సమావేశాలు నిర్వహించనున్నారు. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా యువత పెద్ద సంఖ్యలో లోకేశ్ ని అనుసరించేలా ప్రణాళికలు సిద్దం చేశారు.

ఇక పాదయాత్రలో భాగంగా లోకేష్ తొలి రోజు.. 8.5 కిలోమీటర్ల మేర వివిధ గ్రామాల్లో పర్యటించనున్నారు.ప్రజలతోమమేకమవుతూ…వారి కష్ట సుఖాలను స్వయంగా అడిగి తెల్సుకోనున్నాడు.

ఇదిలా ఉంటే .. యువగళం పాదయాత్రకు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రైవేట్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది.’ జెండా పట్టబుద్ధాయితాంది… లోకేశో….
జై కొట్ట బుద్ధాయితాంది… లోకేశో….’ పాట నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది. మేము సైతం లోకేశ్ వెంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole