హిందూ దేవతలను కించ పరిస్తే సహించేది లేదు: జనసేన పవన్

సెక్యూలరిజం ముసుగులో హిందూ దేవతలను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అన్ని మతాలను సమానంగా చూసే దృక్పధం ప్రతి ఒక్కరూ అలవరచు కోవాలని పిలుపునిచ్చారు. ఒక మతం వారిని పదే పదే అవమానపరిస్తే…వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని జన సేనాని మండిపడ్డారు.

కాగా ఇటీవల హిందు దేవతల మీద దూషణలు పెరిగిపోయాయని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. మహమ్మద్ ప్రవక్త, జీసస్ లపై వ్యాఖ్యలు చేయడానికి భయపడతారు కానీ సెక్యులర్ ముసుగులో హిందూ దేవతలను కించపరిచడానికి మాత్రం వెనకాడబోరని ఫైర్ అయ్యారు. శబరిమల అయ్యప్ప స్వామి.. సరస్వతి దేవి.. ఇలా ఏ మతం ఆరాధ్య దైవాలను అగౌరవ పరచినా.. కించపరుస్తూ మాట్లాడినా సరే బయటకు వచ్చి తాటతీస్తానని పవన్ హెచ్చరించారు.