Newsminute24

కాలం నేర్పిన పాఠం….

 కిరణ్ రెడ్డి వరకాంతం(ఐన్యూస్ జర్నలిస్ట్): ఎనుముల రేవంత్ రెడ్డి.సరిగ్గా పదేళ్ల కిందట ఈ పేరు కొద్దిమందికే తెలుసు.ఎప్పుడైతే *ఓటుకు నోటు” ఇష్యూ తెరపైకి వచ్చిందో అప్పుడే రేవంత్ హీరో అయ్యాడు.కాదు కాదు కేసీఆరే ఆయన్ని హీరోని చేశాడు.వాస్తవానికి ఓటుకు నోటు అనేది పెద్ద నేరమేమి కాదు (అంటే రాజకీయాల్లో ఇలాంటి ఎత్తులు సహజమే కాబట్టి).రేవంత్ ఆధారాలతో సహా బయట పడ్డాడు కాబట్టే నిందితుడయ్యాడు.అయినా రేవంత్ ఏదో దేశ ద్రోహం చేసినట్టుగా రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం…జైల్లో తోయడం చక చకా జరిగిపోయాయి.అంటే చేతిలో అధికారం ఉంది కాబట్టి అప్పుడు ఏదైనా సాధ్యమైంది.ఇక్కడే కేసీఅర్ రాంగ్ స్టెప్ వేశారు.రేవంత్ అంటే తెలియని వారికి సైతం తెలియజేశారు. ఓ విధంగా చెప్పాలంటే రేవంత్ ను తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేశాడు.ప్రజల్లో ఆయనకు సానుభూతిని తెచ్చిపెట్టాడు.ఆ అణచివేత,ఆలోచన నుంచి పుట్టిన ఆశయమే….రేవంత్ ను ఇప్పుడు సీఎం పీఠం ఎక్కేలా చేసింది.సీనియారిటీతో సాధ్యం కానీ పని..కృషితో కసితో సుసాద్యమైంది. అణచివేత నుంచి పుట్టే తెగింపు ఎంత ప్రమాదకరమో… రేవంత్ కథ రుజువు చేసింది.అంతేకాదు ఇప్పుడు కేసీఅర్ కు రేవంత్ కథ కనువిప్పు కలిగించినట్టయింది.

అంటే కాలం ఎప్పుడు ఒకలా ఉండదు.ఆ రోజు కేసీఅర్ చేతిలో అధికారం ఉంది కాబట్టి రేవంత్ అణచివేయబడ్డాడు.ఇప్పుడు కాలం మారింది.రేవంత్ సీఎం అయ్యాడు.కేసీఅర్ మాజీ అయ్యాడు.చూసారా మనకు కాలం నేర్పిన పాఠం.రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులే కాదు.సహనం,సంయమనం కూడా అవసరమని మాత్రం కాలం చెబుతుంది.ఇందులో నీతి ఏంటంటే ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది.ఈ రోజు నీదే కావొచ్చు…రేపటి రోజు నాదే అనుకుని సర్దుకుపో.కాలమే నిన్ను విజయ తీరాలకు చేర్చుకుంది.కాలం కలసి వస్తే ఏదైనా సాధ్యమే మరి.సో…ఏదేమైనా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ కు కంగ్రాట్స్ & ఆల్ ది బెస్ట్.

నోట్ : చివరగా రేవంత్ కు ఒక్కమాట. ప్రతీకారం తీర్చుకునేందుకు నీవు పనిచేయకు.ప్రజల కోసం పనిచేయి.ప్రజల మెప్పుకోసం కృషి చేయి.ఎందుకంటే కాలం చాలా తెలివైనది కాబట్టి…

 

Exit mobile version