యాదాద్రి _ భువనగిరి: నేలపట్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కు చెందిన 1997_98 విద్యా సంవత్సరం పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్దులు.. ఉపాధ్యాయులకు శాలువా కప్పి , సరస్వతి దేవి జ్ఞాపికతో సన్మానించారు. విద్యార్థులు తమ పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.తమ విద్య, వైవాహిక జీవిత విశేషాలను స్నేహితులతో పంచుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు.