యూపీ సీఎం యోగికి గుడి కట్టి పూజిస్తున్న యువకుడు..!!

ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని దైవంగా భావించి ఓ యువకుడు గుడికట్టి ఆరాధిస్తున్నాడు.హిందువుల పవిత్ర క్షేత్రం రామజన్మభూమికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసౌధ బ్లాక్‌లోని మౌర్యకు చెందిన ప్రభాకర్ మౌర్య యోగి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి విల్లు చేతబట్టిన యోగి విగ్రహాం.. కోదండరాముడును పోలి ఉంది. ఈవిగ్రహాం చుట్టు యువకుడు రోజుకు రెండు సార్లు ప్రార్థనలు చేస్తున్నాడు.

కాగా యోగి విగ్రహా ప్రతిష్టాపనపై సదరు యువకుడిని ఓ జాతీయ మీడియ ప్రశ్నించగా.. అదిరిపోయే సమాధానమిచ్చాడు.ముఖ్యమంత్రిగా యోగి చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మేలుచేస్తున్నాయని ..అతడిని దైవంగా భావిస్తున్నారని కొనియాడాడు. అందుకనుగుణంగానే యోగికి గుడికట్టాలని తాను భావించినట్లు చెప్పుకొచ్చాడు.యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టాకా..రాష్ట్రంలో ప్రజారంజక పాలన అమలువుతుందని పేర్కొన్నాడు.

ఇక తనకు సొంత భూమి.. ఉద్యోగం లేదని.. యూట్యూబ్ లో భక్తి పాటలను పోస్టు చేయడం ద్వారా నెలకు దాదాపు లక్షరూపాయలు సంపాదిస్తున్నట్లు మౌర్య చెప్పుకొచ్చాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బుతోనే యోగి గుడినిర్మాణం చేపట్టినట్లు వెల్లడించాడు. ఆలయ నిర్మాణానికి 8.5 లక్షలు ఖర్చుయినట్లు స్పష్టం చేశాడు. యోగి విగ్రహాన్ని రాజస్థాన్ లో ప్రత్యేక నిపుణులతో తయారుచేయించినట్లు మౌర్య పేర్కొన్నాడు.

Optimized by Optimole