పంజాబ్ మాజీ సీఎం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.అమరీందర్ కు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్. ఆయనతో పాటు పంజాబ్ మాజీ డిప్యూటీ స్పీకర్ అజైబ్ సింగ్ భట్టి కాషాయ కండువా కప్పుకున్నారు.అయితే అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. భర్త ఏది చేసిన భార్య అనుసరించాల్సిన అవసరం లేదని..బీజేపీలో చేరుతున్న సందర్భంగా వ్యాఖ్యానించడం గమన్హారం.ఆమె 2009-2014 వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అసిస్టెంట్ విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.
కాగా ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన అమరీందర్.. గత ఎన్నికల్లో హస్తం పార్టీని వీడి సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అమరీందర్ పంజాబ్ సీఎం గా ఉన్నప్పుడు.. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధుతో విభేదాలు రావడంతో పార్టీ ఆయనను సీఎం పదవి నుంచి తప్పించింది. దీంతో మనస్థాపానికి గురైన అమరీందర్ కాంగ్రెస్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించి బీజేపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్లాడు. ఆ ఎన్నికల్లో అతని పార్టీ ఒక్క సీటు గెలవకపోగా.. అమరీందర్ సింగ్ సైతం ఓడిపోయాడు.
ఇక ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్ పేరు సైతం వినిపించింది. ఆయన అభ్యర్థిత్వతాన్ని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ధృవీకరించింది.అయితే అనూహ్యంగా బీజేపీ అధిష్టానం ధన్ ఖడ్ పేరును ప్రకటించడం.. గెలవడం చకచక జరిగిపోయాయి. గత కొద్ది రోజులుగా అమరీందర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఈనేపథ్యంలోనే ఆయన పార్టీని బీజేపీలో వీలినం చేశారు.బీజేపీలో అమరీందర్ చేరిక పంజాబ్ లో ఆపార్టీకి కలిసోస్తుందని చెప్పవచ్చు. జాతీయవాద సెక్యూలర్ సిక్కు నాయకుడిగా అమరీందర్ ఇమేజ్..బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా మారుతుందని కాషాయం నేతలు భావిస్తున్నారు.