మునుగోడులో బీజేపీ పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతోంది. తాజాగా వివిధ పార్టీలకు చెందిన నారాయణపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలను.. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.ధర్మయుద్ధంలో ప్రజలంతా మద్దతు తెలిపాలని రాజగోపాల్ అభ్యర్థించారు. కేసీఆర్ ను గద్దె దింపడం.. ప్రధాని మోదీ,అమిత్ షాలతోనే సాధ్యమని తేల్చిచెప్పారు.ప్రతిపక్షనేతలు రాజకీయంగా ఎదుర్కొలేక దొంగచాటున అసత్యప్రచారాలు చేస్తున్నారని రాజగోపాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
కాగా మునుగోడు నియోజకవర్గం నారాయణపూర్ మండలంలోని పుట్టపాక, శేరిగూడెం, జనగాం, రాచకొండ, కోతులాపురం, పోర్లగడ్డతండా, ఐదుకోనల తండా, కంకణాల గూడెంకు చెందిన టీఆరెయస్, కాంగ్రెస్, సిపిఐ నేతలు దాదాపు 500 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని.. ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. తన రాజీనామాతో ఫామ్ హౌస్ లో పండుకున్న కెసిఆర్ ను మునుగోడు కు రప్పించానని ఎద్దేవా చేశారు.హుజురాబాద్ ఉప ఎన్నికనగానే కేసీఆర్ దళిత బందు పథకం పెట్టారని.. ఇఫ్పుడు మునుగోడు ఉప ఎన్నిక కు గిరిజన బందు పథకం తెస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.
ఇక తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలంటే మునుగోడు ఉపఎన్నిక లో బంపర్ మెజార్టీతో బీజేపీ నీ గెలిపించాలని రాజగోపాల్ అభ్యర్థించారు. 1400 మంది యువకులు ఆత్మబలిదానాలతో రాష్ట్రం సిద్ధిస్తే .. కేసీఆర్ కుటుంబం రాజకీయ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ ల పేర్ల మీద వేల కోట్ల రూపాయలు దోపిడి చేసిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ అంతం బీజేపీతోనే సాధ్యమని రాజగోపాల్ కుండబద్ధలు కొట్టారు.