మౌనం వీడిన నటి శిల్పా శెట్టి!

మౌనం వీడిన నటి శిల్పా శెట్టి!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎట్టకేలకు మౌనం వీడింది.
తన భర్త రాజ్​కుంద్రా పోర్న్​ చిత్రాల కేసు విషయమై తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆమె కోరింది. కుటుంబ గోపత్యను గౌరవించాలని.. నిజా నిజాలు ఏమిటో తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై ఆసక్తి కాస్త మానుకోవాలని సూచించింది. కొంత మంది మాపై పనికట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై ఎన్నో నెగటివ్​ కామెంట్లు చేశారు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యప్తు కొనసాగుతోంది. పోలీసులు, భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. సినీ ఇండస్ట్రీలో 29ఏళ్లుగా ఉన్నాను. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. కాబట్టి ఈ కష్టకాలంలో నా పిల్లలు, కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరుతున్నా. చట్టం తన పనిన తాను చేసుకుపోతుంది. సత్యమేవ జయతే” అని శిల్పా శెట్టి పేర్కొన్నారు.
ఇక పోర్న్ రాకెట్ కేసులో శిల్పా శెట్టి భర్త, వ్యాపార వేత్త ను ముంబయి పోలీసులు జులై 19న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ ల ద్వారా అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని కుంద్రా పై ఆరోపణలు ఉన్నాయి. పోర్న్ రాకెట్ కేసుకి సంబంధించి.. గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించిన అధికారులు సాక్ష్యాలను సేకరించి ఇటీవల కుంద్రాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.