ఏరువాక పౌర్ణమి విశిష్టత!

ఏరువాక సాగారో రన్నో చిన్ననా… నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా పడమటి దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు గురిసే వాగులు వంకలు ఉరవడిజేసే ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా..!!

తొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి.
తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.
ఈ రోజునే పొలాల ఇళ్లల్లో పనిచేసే జీతగాళ్ళ/ పాలేర్లు సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది.
పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురవాలని సిరిధాన్యాలతో ఇల్లు నిండాలని ప్రజలంందరూ సంతోషంగా ఏరువాక పౌర్ణమిి జరుపుకుంటారుు.

జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.

ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. అంటే వ్యవసాయం మొదలుపెట్టడం. సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి పొంగలి పెడుతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు.