యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్డే హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గీతాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం విడుదల చేశారు. అరె.. గుచ్చే గులాబీలాగా.. నా గుండె లోతుల్లో తాకినదే.. అంటూ సాగే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరిచిన ఈ బాణికి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఆర్యన్ మాలిక్ ఆలపించారు. కాగా చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్ తో పాటు, సాంగ్ చూస్తుంటే అఖిల్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.