Karimnagar:గంగులపై భూ కబ్జా ఆరోపణలు.. కేసిఆర్ కు బాధితుడి విజ్ఞప్తి..

Karimnagar: మంత్రి గంగుల కమలాకర్ పై భూదందా ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.  తన భూమి కబ్జా చేసి తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఓ బాధితుడు వాపోతున్న  వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తక్షణమే గంగుల కమలాకర్ పై చర్చలు తీసుకోని తన భూమిని ఇప్పించిమని  ముఖ్యమంత్రి కెసిఆర్ ను బాధితుడు వేడుకుంటున్నాడు.

కాగా వీడియోలో భూ కబ్జా పై  బాధితుడు వెంకటరమణ మాట్లాడుతూ.. తన భూమికి సంభందించిన ఆధారాలు ఉన్నాయని.. మంత్రి అండతో కొందరు బెందిరింపులకు గురిచేస్తున్నారని .. భయంతో హైదరాబాద్ లో తలదాచుకుంటున్నాని ఆవేదన వెలిబుచ్చాడు.ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే వారు మంత్రికి వత్తాసు పలుకుతున్నారని బాధితుడు వాపోయాడు.

You May Have Missed

Optimized by Optimole