BJPTelangana: తెలంగాణ బిజెపి నాయకత్వానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆరు నూరైనా సరే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ 75 సీట్లు గెలిచి తీరాలని రాష్ట్ర నాయకత్వానికి షా టార్గెట్ ఫిక్స్ చేశారని.. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలంతా హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
అంతేకాక గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడాన్ని జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీ కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. నేతలు ఎంతటి వారైనా సరే పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యొద్దని.. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించింది.