అమ్మవారి విశ్వ విద్యాలయంలో అన్యమతస్తుల వేడుక!

అది హిందూవుల కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్నచోటు. ఆదగ్గర్లోనే పద్మావతి అమ్మవారి పేరిట నడుస్తున్న విశ్వవిద్యాలయం. అక్కడ అన్యమతస్తుల వేడుకల నిషేదం అమల్లో ఉంది. అయితే తాజాగా.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్తుల వేడుకను అధికారుల సమక్షంలోనే అట్టహసంగా జరిపారు. దీంతో హిందూసంఘాల నేతలు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అన్యమతస్తుల వేడుకలు నిషేదం అమల్లో ఉంటే.. వేడుకలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
కాగా సాక్ష్యాత్తు పద్మావతి అమ్మవారి పేరుతో నడుస్తున్న మహిళ విశ్వవిద్యాలయంలో.. నిబంధనలకు విరుద్ధంగా క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అన్యమతాలకు సంబంధించిన వేడుకలు నిషేధం అమల్లో ఉంది. దీంతో ఇప్పుడు క్రిస్మస్ వేడుక వివాదాస్పదంగా మారింది.అంతేకాక ఈ వేడుకల్లో వందలాది మంది విద్యార్ధులు, అధ్యాపకులు పాల్గొనడంపై హిందూ ధార్మిక సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. శ్రీవారి నిధులతో నడిచే విశ్వవిద్యాలయంలో అన్యమత వేడుకలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా.. హిందూవులపై దాడులు ,ఆలయాల కూల్చివేత వంటి ఘటనలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. టీటీడీ వివరణ ఇవ్వాలన్న హిందు సంఘాల నేతలు.. తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి ఇటీవల తిరుమల, తిరుపతిలో అన్యమత ప్రచారాలు, అపచారాలు జరిగిపోతూనే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు మరింత ఎక్కువయ్యాయని భక్తులు, స్థానికులు, హిందు ధార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా మాంసం, వ్యభిచారం, మద్యం అమ్మటం, తాగిన ఘటనలు ఉన్నాయి. అయితే అడ్డుకోవాల్సిన టీటీడీ అధికారులు.. అప్పటికప్పుడు ఏదో హడావుడిగా కంటితుడుపు చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత చల్లబడిపోవడం జరిగిపోతూనే ఉన్నాయి. మరి.. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలపై టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Optimized by Optimole