మరోసారి భారత్, పాక్ సమరం.. ఆనందంలో క్రికెట్ ఫ్యాన్స్..

క్రికెట్ అభిమానులు మరోసారి దాయాదుల సమరం వీక్షించోతున్నారు. ఆసియా కప్ టోర్నీ భాగంగా భారత్ పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. ఇప్పటికే టోర్నీ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాక్ జట్టు ..సూపర్ -4 లో ఢీ కొనబోతోంది. దీంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఆదివారం జరగబోయే ఈమ్యాచ్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.గ్రూప్ -Aలో భారత్ .. పాక్ ,హాకాంగ్ జట్టును ఓడించి బెర్త్ ను ఖరారు చేసుకోగా.. పాక్ చివరి మ్యాచ్ లో ఓడించి బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. మిగతా గ్రూప్ -Aలో ఆప్ఘనిస్తాన్ , శ్రీలంక జట్టు బెర్తులను ఖరారు చేసుకున్నాయి.

ఇక సూపర్ రౌండ్_4లో మొదటి మ్యాచ్ లో శ్రీలంక-ఆఫ్ఘన్ జట్టు తలపడబోతున్నాయి. ఉత్కంఠగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో శ్రీలంక జట్టు ..బంగ్లాదేశ్ ని ఓడించి బెర్త్ ను ఖరారు చేసుకుంది. అనంతరం సెప్టెంబర్ 4 న భారత్ పాక్ జట్లు ఢీకొనబోతున్నాయి. రెండు మ్యాచ్లో గెలిచిన జట్లు కప్ కోసం పోటిపడతాయి.