‘టీంఇండియా’ పై ఆసీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవడంపై అజట్టు టెస్ట్ కెప్టెన్ టీం పైన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తమ ఏకాగ్రతను దెబ్బతీయడం వలనే టీమిండియా తమపై టెస్ట్ సిరీస్ గెలవగలిగిందిని పైన్ అన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు 2-1తో టెస్ట్ సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టును  వారి దేశంలో ఓడించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారత జట్టు టెస్ట్ సిరీస్ విజయంపై పైన్ మాట్లాడుతూ.. టీం ఇండియా ఆటగాళ్లు మొదట గబ్బా టెస్ట్లో ఆడలేమని చెప్పారని.. దాంతో మేము గందరగోళం లో పడిపోయాం.. మ్యాచ్ సజావుగా సాగుతోందో లేదో అన్న అనుమానం గందరగోళంలో పడిపోయాం.. వారి మైండ్ గమే తో మా ఏకాగ్రతను దెబ్బతీశారు అని పైన్ పేర్కొన్నాడు.

 

Optimized by Optimole