ఎస్టీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్.. సీఎం కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లు అమలుకాకుండా కేసీఆర్ మహా కుట్ర పన్నారని మండి పడ్డారు. దమ్ముంటే రిజర్వేషన్లు అమలుపై ఉప్పల్ నియోజకవర్గంలోని విఘ్నేశ్వర ఆలయం ముందు ప్రమాణం చేద్దాం రమ్మంటూ  సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసిఆర్ మాత్రమేనని సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి కేసిఆర్.. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఓడించేందుకు కేసీఆర్ పన్నాగం పన్నాడని సంజయ్ ఆరోపించారు.ఇప్పుడు నక్క వినయం ప్రదర్శిస్తూ.. బీజేపీ పై నెపం నెట్టి .. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలుకాకుండా సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకునేందుకు కేసిఆర్ స్కెచ్ వేశారని అగ్రహం వ్యక్తం చేశారు.ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన.. బట్ట బయలు చేస్తామని సంజయ్ హెచ్చరించారు.

అంతకుముందు పాదయాత్రలో భాగంగా గంగపుత్రులు సంజయ్ నూ కలిశారు. తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. గంగపుత్రుల పొట్ట కొట్టేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర పన్ని జీవో నంబర్ 6 ను తెచ్చిందన్నారు. జీవో ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.మాజీ ప్రధాని వాజ్ పేయి కేంద్రంలో ప్రతిపక్షంకొట్ ఉన్నప్పుడు.. గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారని గుర్తు చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే ఎస్టీ జాబితాలో చేర్చాలని గంగపుత్రులు బండి సంజయ్ కు విజ్ఞప్తి చేశారు.

Optimized by Optimole