×

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్):

అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా ఉండేది. వాటిపై రుసరుసా కిందకు నడుస్తూ దాదాపు ఆఖరి మెట్టు దిగుతున్నానేమో….! నా వెనుక నుంచి, ‘ఏయ్ దిలీప్, ఏంటి అలా వెళిపోవడమేనా? ఒక నిమిషం ఆగు, నేనూ వస్తున్నానయా’ అన్న మృదువైన స్వరం నన్నాపింది. ఆ ఆఖరి మెట్టు కూడా దిగి నిలబడ్డాను. దగ్గరకొచ్చి, పిలుపంత మృదువుగా భుజం చరిచి, ‘అర నిమిషం ఆలస్యమైతే అలా విసురుగా వెళిపోవడమేనా? ఇదేమైనా బాగుందటయ్య? మనం ఎంతకాలంగా పరస్పరం పరిచయస్తులం చెప్పు?’ అని నిందాపూర్వకంగా ప్రశ్నించారాయన. నేనేమో “…. నా తర్వాత విజిటింగ్ కార్డు పంపిన అతన్ని నా కన్నా ముందు మీరు లోనికి పిలిచారని…’ ఏదో సనిగాను. ‘భలే వాడివయా! నీ కార్డు ముందే చూశాను. నిజానికి నేనో పెద్దాయన్ని కలవడానికి బయటకు వెళ్లాలి, అర్జంట్, అట్టే సమయం లేదు. కార్లో కూర్చొని నీతో నింపాదిగా మాటాడొచ్చులెమ్మని, నీ తర్వాత వచ్చినాయన్ని ముందు పిలిచి ఓ మాట చెప్పి అరనిమిషంలో పంపించా. తీరా నేను బయటకు వచ్చి చూస్తే నువేమో వెళిపోతున్నావ్’ అన్నాడు నిష్ఠూరంగా. ఇంతలో రయ్ మంటూ ఆయన కారొచ్చి మా ముందాగింది. ‘రా ముందు కారెక్కు’ అన్నారు వ్యవధి ఇవ్వకుండా. ‘నా స్కూటర్ ఉంది, మరి అదిక్కడే ఉండిపోతుందిగా!?’ అన్నా కంగారుగా. ‘పర్లేదు లేవయా, నిన్ను మళ్లీ ఇక్కడే దింపుతాం, లేదంటే మీ ఆఫీస్ దగ్గర దింపుతాం, తర్వాత మా కానిస్టేబుల్ ఎవరో నీ స్కూటర్ నీకు తెచ్చిస్తారులే, అదేం పోదు’ అనంటే, ఇక మారు మాటాడకుండా ఆయనతో పాటు కారెక్కాను. కార్ రుయ్యుమంటూ దూసుకువెళ్లి పంజాగుట్ట, సాయిబాబా టెంపుల్ కాలనీలో ఓ పెద్దాయన ఇంటి ముందు ఆగే వరకు మేమిద్దరం మాటాడుకుంటూనే ఉన్నాం. నిజానికది, అంతకు ముందు రోజు రాత్రి మేమిద్దరం జరిపిన ఓ టెలిఫోన్ సంభాషణ కొనసాగింపే! అది ఆయన ప్రమోషన్ గురించి. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సీఐడీ చీఫ్ హనుమంత జగన్నాయకుల దొర @ H J Dora ను, పదోన్నతితో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) గా నియమిస్తూ ఆ పూటే ఉత్తర్వులిచ్చింది. మేం కారు దిగాక, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆశీస్సులు తీసుకోవడానికి ఆ ఇంట్లోకి దొర నడిచారు. అక్కడ్నుంచి అదే కారులో ఆయన డ్రైవర్ నన్ను తిరిగి డీజీపీ కార్యాలయ ప్రాంగణంలో దింపారు.


హెచ్. జే. దొర నాకు తెలిసి ఎంతో లౌక్యం, నైపుణ్యం, తెలివితేటలు కలిగిన ఓ సమర్థుడైన పోలీస్ అధికారి. శ్రీకాకుళం జిల్లా వాడైన ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేశారు. 1965 లో ఐపీఎస్ తో అఖిలభారత సర్వీసులో చేరిన్నుంచి ఆయన ఎన్నెన్నో ఉన్నత పదవులు, హోదాలు చేపట్టి పలు బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు. కేంద్రంలో CBI, CISF, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్వీసుల్లోనూ పనిచేశారు. సర్కార్ లోనే కాకుండా పుట్ బాల్ అసోసియేషన్, సత్యసాయి సేవా ట్రస్ట్, జీఎమ్మార్ ఇండస్ట్రీస్ వంటి పలు ప్రభుత్వేతర సర్వీసుల్లోనూ రాణించిన ప్రజ్ఞాశాలి దొర.
వామపక్ష తీవ్రవాదం, ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమాన్ని దేశంలో ప్రస్తుత ప్రభుత్వాలు తుత్తునియలు చేస్తున్న రాజ్యం ఆధిపత్య వ్యూహరచనల మూలాలు నాటి దొర నిర్వాకాల్లోనే ఉన్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జరిపే రాజ్యహింస ను నిరసించే వారు దొరని ‘తేనెపూసిన కత్తి’ వంటి తీయని మాటల కర్కోటకుడంటారు. ఈ విషయంలో అప్పటి ముగ్గురు ఐపీఎస్ లు, దొర-అరవింద్ రావు-శ్రీరామ్ తివారీ…. అదొక డెడ్లీ కాంబినేషన్! అప్పుడు నేను అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ‘ఈనాడు’ పత్రిక క్రైమ్ రిపోర్టర్ ని. అంతకు కొన్ని సంవత్సరాలు ముందు, హైదరాబాద్ జంట నగరాలు, శివార్లలో చైన్ స్నాచింగ్ లు, దొంగతనాలు, దోపిడీలతో ముఠాలు పెట్రేగిపోతున్నాయి. దొర సిటీ పోలీస్ కమిషనర్ గా వచ్చారు. 1992 అయోధ్య బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర శాంతిభద్రతల ఫాలోఅప్ నగరంలో కొనసాగుతోంది. పనిలో పనిగా పెద్ద సంఖ్యలో దోపిడీ ముఠాల పీఛమనచి బొక్కలో తోశారు. దొర-భాస్కర్-సీవీ నర్సయ్య అది మరో డెడ్లీ కాంబినేషన్!
అలా దొర హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఉన్నప్పట్నుంచి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, తదనంతర సర్వీసు విరమణ వరకు…. ఆయన్ని దగ్గరగా చూడటమే కాక బాగా ఎరిగిన వాడ్ని నేను. జర్నలిస్టుల గురించి కూడా ఆయన తెలుసుకుంటూ ఉండేవారు. విశాల సమాజ హితంలో మా వైఖరి, వృత్తి నిబద్దత చూశాక, పోలీసింగ్ లోని చాలా విషయాలు, సమాచారం మాతో పంచుకోవడానికి ఆయన వెనుకాడేది కాదు. కొన్ని కొన్ని విషయాల్లో.. ఆయన మమ్మల్ని, మరికొన్ని విషయాల్లో మేమాయన్ని బహిరంగంగానే విబేధించేది. అయినా మేం సఖ్యతతో ఉండేది.
83 ఏళ్ల వయసుతో H J Dora ఇవాళ తుదిశ్వాస తీసుకున్నారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
ఇదే నా కన్నీటి నివాళి.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole