కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ సీఎస్ కు బండి లేఖ..!

కాళేశ్వరం ప్రాజెక్ట్  సందర్శనకు సెప్టెంబరు మొదటి వారంలో అనుమతి ఇవ్వాలని కోరుతూ  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్   ప్రభుత్వ  ప్రధాన  కార్యదర్శి సోమేష్ కుమార్ కి  లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటునట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు . ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు.. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు  ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించి నిజానిజాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పర్యటన చేపట్టబోతున్నట్లు సంజయ్‌ స్పష్టం చేశారు.

ఇక 1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్‌ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శంచిన విషయమై లేఖలో సంజయ్ ప్రస్తావించారు. అంతేకాక 2004 – 2009 లో జరిగిన జలయజ్ఞం పనులపై  వచ్చిన విమర్శలకు.. ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని గుర్తు చేశారు. తమ బృందం తో పాటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇరిగేషన్‌ అధికారులను పంపి తమ సందేహాలను నివృత్తి చేయాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు.

 

Optimized by Optimole