తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు రంగం సిద్దమయ్యింది. త్వరలోనే ఆయన గద్వాల్‌లోని జోగులాంబ ఆలయం నుంచి తన సెంకండ్ ఫేజ్ ప్రజా సంగ్రామాన్ని కొనసాగించనున్నారు.
కాగా మరో రెండు సంవత్సరాల్లో తెలంగాణా ఎన్నికలు ఉండగా… దానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఐదు విడతలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ తిరగాలని ప్రణాళికలు వేసుకున్నారు. అయితే, ఆయన మొదటి విడత పాదయాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి మొదలవగా, త్వరలో ప్రారంభయ్యే రెండో విడత యాత్రను జోగులాంబ ఆలయం నుంచి మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా మీదుగా మహుబూబ్ నగర్ జిల్లాలో రెండో విడతను ముగించే విధంగా ప్రణాళిక రూపాందించుకుంటున్నారు. ఈ షెడ్యుల్ సుమారు 50 రోజులు ఉండనుంది. అయితే, ఈ నెల 21న రెండో విడత ప్రారంభించాలని అనుకున్నప్పటికీ దీనిపై పార్టీ నిర్థష్టంగా ఒక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటికే, తెలంగాణాలో షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం కొనసాగుతోంది. ఈ తరుణంలో బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రూట్ మ్యాప్‌ను సిద్దం చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా ఇప్పటికీ పలువురు నాయకులతో చర్చలు జరిపిన బండి సంజయ్… సెకండ్ ఫేజ్ మ్యాప్ కసరత్తు పూర్తయిన తర్వాత తదుపరి తేదీలపై స్పష్టత ఇస్తారు.