ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజలు ఈమేరకు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సర్వేలో 70శాతం ఓట్లతో మోదీ మొదటి స్థానంలో నిలవగా.. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66శాతం ఓట్లతో రెండో స్థానంలో.. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58శాతం ఓట్లతో మూడో స్థానంలో.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ టాప్ 10లో చివరిస్థానంలో నిలిచారు.