దేశ మార్కెట్లో పసిడి ధరల్లో పెద్దగా మార్పు కనిపించకపోయినా… హైదరాబాద్, చెన్నై నగరాల్లో ధర స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది.
ఇక సోమవారం దేశంలో బంగారం ధరలను గమనిస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యారట్ బంగారంపై నిన్నటిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయలు కాగా, 24 క్యారెట్ బంగారం 47 వేల 220 రూపాయలుగా ఉంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలు చూస్తే… చెన్నైలో 22 క్యారెట్ బంగారం 45 వేల 430 రూపాయలుగా ఉంటే, 24 క్యారెట్ బంగారం ధర పెరిగి 49 వేల 560 రూపాయలుగా ఉంది. అదే, హైదరాబాద్‌లో పసిడి ధరలు నిన్నటి మీద 10 రూపాయలు పెరిగాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 120 రూపాయలుగా ఉంటే, 24 క్యారెట్ గోల్డ్ 49 వేల 220 రూపాయలుగా ఉంది. ఇక, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నట్లు తెలుస్తోంది.