దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత త‌గ్గింది. ప‌లు రాష్ట్రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల సుంకాన్ని త‌గ్గించ‌మ‌ని ఒక‌వైపు ఆందోళ‌న‌లు క‌నిపిస్తున్నా మ‌రోవైపు స్థిరంగా ఉన్న ఇంధ‌నం ధ‌ర‌ల‌పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి.
దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను చూసిన‌ప్పుడు… రాజ‌థాని ఢిల్లీలో స్థిరంగా లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌, హైద‌రాబాద్‌లో పెట్రోల్ ఈ రోజు స్థిరంగా 108 రూపాయ‌ల 20 పైస‌లుంటే… డీజిల్ ధ‌ర 94 రూపాయ‌ల 62 పైస‌లుగా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప‌ట్ట‌ణాల్లో ఉన్న ఇంధ‌నం ధ‌ర‌ల‌ను చూస్తే… క‌రీంన‌గ‌ర్‌లో పెట్రోల్ నిన్న‌టి కంటే 17 పైస‌లు పెరిగి 108 రూపాయ‌ల 55 పైస‌లుగా ఉంటే.. డీజిల్ 94 రూపాయ‌ల 94 పైస‌లుగా ఉంది. నిజామాబాద్‌లో పెట్రోల్ నిన్న 4 పైస‌లు త‌గ్గి ఈ రోజు 74 పైస‌లు పెరిగింది. ఇక్క‌డ‌ పెట్రోల్ 110 రూపాయ‌ల 27 పైస‌లుకు చేరుకుంటే, డీజిల్ ధ‌ర సుమారుగా రూపాయి పెరిగి 96 రూపాయ‌ల 54 పైస‌లుగా ఉంది. ఆదిలాబాద్‌లో పెట్రోల్ 110 రూపాయ‌ల 58 పైస‌లుగా ఉంటే, డీజిల్ కూడా కాస్త పెరిగి 96 రూపాయ‌ల 84 పైస‌లుగా ఉంది.
ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఈ రోజు విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ 110 రూపాయ‌ల 71 పైస‌లుగా ఉంటే… డీజిల్ ధ‌ర తగ్గి 96 రూపాయ‌ల 77 పైస‌ల‌య్యింది. గుంటూరులోనూ పెట్రోల్ 110 రూపాయ‌ల 71 పైస‌లుంటే. డీజిల్ 96 రూపాయ‌ల 77 పైస‌లుగా ఉంది. ఇక‌, విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్‌ 109 రూపాయ‌ల 99 పైస‌లుండగా, డీజిల్ ధ‌ర 96 రూపాయ‌ల 5 పైస‌లుగా ఉంది. ఇక చిత్తూరులో పెట్రోల్ 110 రూపాయ‌ల 51 పైసలుంటే, డీజిల్ 96 రూపాయ‌ల 53 పైస‌లుగా ఉంది.