నరేంద్రమోదీ అభినవ గరళ కంఠడు : బండి సంజయ్
BJPTelangana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినవ గరళకంఠుడు అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు చిమ్ముతున్న విషాన్ని 8 ఏళ్లుగా కంఠంలో దాచుకుంటూ ప్రజల కోసం పనిచేస్తూ దేశాన్ని అభివ్రుద్ధివైపు నడిపిస్తున్నారని అన్నారు. ఓ వర్గం వాళ్ల ఇంటికిపోయి మల్లిఖార్జున ఖర్గే బొట్టును ఎందుకు చెరిపివేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బొట్టు చెరిపేసుకునే వాళ్ల పార్టీలకు కర్నాటక ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. బాంబు పేలుళ్లకు పాల్పడ్డ లుచ్చాలకు చింతామణిలో ఆశ్రయమిచ్చిన నాకొడుకుల అంతు చూడాలన్నారు. అలాంటి బాంబు పేలుళ్లకు పాల్పడే లుచ్చాలను తరిమితరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు.
కర్నాటక ఎన్నికల్లో భాగంగా చింతామణి అసెంబ్లీ నియోజకవర్గంలో కోలార్ ఎంపీ మునిస్వామి, బీజేపీ అభ్యర్ధి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, జెనవాడె సంగప్పలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. మునిస్వామితో కలిసి ప్రచార రథమెక్కి చింతామణి వీధుల గూండా ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహిస్తూ బీజేపీకి ఓటేయాలని బండి అభ్యర్ధించారు. ఇక సంజయ్ రాకతో చింతామణి ప్రజలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది. బాణా సంచా పేల్చి, డ్యాన్సులు వేస్తూ జై బండి సంజయ్, తెలంగాణ టైగర్, కాబోయే సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. భారతమాతా కీ జై… జై శ్రీరాం అంటూ ర్యాలీ పొడువునా నినదించారు. రోడ్ షోలో అత్యధిక సంఖ్యలో యువకులే ఉండటం గమనార్హం.