Bandisanjay: కాంగ్రెెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మలిదశ ప్రజాహిత యాత్ర అశేష జనం మధ్య  అట్టహాసంగా  ప్రారంభమైంది.యాత్రకు అడగుడున ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ,చిగురుమామిడి మండలాల్లో  తొలి రోజు యాత్ర సాగింది. వివిధ గ్రామాల ప్రజలను సంజయ్ స్వయంగా అడిగితెలుసుకున్నారు.సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు.యాత్రలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను సంజయ్ ఎకిపారేశారు. హుస్నాబాద్ నియోజక వర్గంతో పాటు కోహెడ, చిగురుమామిడి మండలాలు.. గ్రామాలకు  కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజలకు అర్థమయ్యే రీతిలో సంజయ్ వివరించారు. 

Bandisanjay, bandisanjay prajahita yatra, karimnagar, newsminute24,

ఇక సంజయ్ మలివిడత ప్రజాహిత యాత్రకు తొలి రోజు అనూహ్య స్పందన లభించింది.వివిధ గ్రామాల్లో సంజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రను సాగించారు. సంజయ్ వస్తున్నాడని తెలిసి వివిధ గ్రామాల ప్రజలు ఇళ్ల ముందు వేచి చూసి..ఆయన రాగానే కరచాలనం చేశారు. భారత్ మాతా కీ జై..జై శ్రీరామ్.. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ యువత నినాదాలు చేశారు.పలు గ్రామాల్లో యువత ఆటలకు సంబంధించి సామాగ్రి కావాలని సంజయ్ ఏకరవు పెట్టుకున్నారు. వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం రూపంలో అందజేయగా.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సంజయ్ భరోసా కల్పించారు.

Bandi special, Bandi Sanjay, Praja hita yatra

అటు యాత్రలో భాగంగా సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు.‘‘సీఎం గారు… మీకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది? 10 ఏళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు తెస్తే… మీరు 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తే…. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని మీరు మోసం చేయబోతున్నారు? అరకొర హామీల అమలుతో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవాలనుకుంటున్నరు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేంద్రం నయా పైసా సాయం చేయలేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. పైగా తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని బుకాయిస్తారా? మోదీ పాలనలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది… అసలు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోందంటే మోదీ గారు ఇస్తున్న నిధుల పుణ్యమే..దమ్ముంటే ఆ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

 

Optimized by Optimole