ప్రధాని మోడీ కి ధన్యవాదాలు : బీసీసీఐ

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పలువురు క్రికెటర్లు కొనియాడారు . ఆస్ట్రేలియాపై టీమిండియా విజయాన్ని మోడీ ప్రస్తావించడంపై క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ‘ ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కి ధన్యవాదాలు ‘ అంటూ దాదా ట్వీట్ చేశాడు. ఇటీవలే చాతి నొప్పితో ఆసుపత్రి పాలైన దాదా , కోలుకున్న తర్వాత చేసిన మొదటి ట్వీట్ ఇదే కావడం విశేషం.
కాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) స్పందిస్తూ .. ప్రధాని మోడీ ప్రేరణ ప్రసంగానికి ధన్యవాదాలు. దేశ కీర్తిని చాటి చెప్పడానికి సాధ్యమైనంత వరకు పోరాడతామని.. బీసీసీఐ ట్విట్టర్లో పేర్కొంది. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాని మాటలను రీట్వీట్ చేస్తూ జాతీయ జెండాని పోస్ట్ చేశారు.

ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్ ‘ లో మాట్లాడుతూ.. ఈ నెలలో ఆస్ట్రేలియా పై భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది.. ఆదిలో ఒడిదొడుకులు ఎదురైనా, పోరాటాన్ని కొనసాగిస్తూ, జట్టు సమిష్టి కృషితో స్పూర్తిదాయక విజయం సాధించిందని ప్రధాని ప్రసంగంలో పేర్కొన్నారు.