ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధిస్తుందని భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఓవార్త సంస్థ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పశ్చిమ్ బెంగాల్లో రాబోయే రోజుల్లో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. అసోంలో అధికారాన్ని నిలబెట్టుకుంటాం. తమిళనాడులో అధికార కూటమిలో కీలకంగా ఉంటామని.. పుదుచ్చేరిలో అధికారాన్ని చేజికిచ్చుకుంటాం. కేరళలో కీలకంగా నిలుస్తామని నడ్డా పేర్కొన్నారు. ఓటమి భయంతో టీఎంసీ కుట్రలు :
బెంగాల్‌లో టీఎంసీ ఓటమిని తథ్యమని నడ్డా వ్యాఖ్యానించారు. కూచ్ బెహర్ ఘటనపై స్పందిస్తూ.. ఓటమి భయంతోనే టీఎంసీ కార్యకర్తలు దాడులు, కుట్రలకు పాల్పడుతుందని అన్నారు. అందులో తాజా ఉదహరణ.. ఆనంద్ బర్మన్ అనే కార్యకర్తను కాల్చిచంపిన ఘటన అని పేర్కొన్నారు. బెంగాల్ హింసపై దీదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు బదులిస్తూ..బెంగాల్‌లో మాత్రమే హింసా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? గత పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నదెవరు? హోం మంత్రి ఎవరు? రాష్ట్ర శాంతిభద్రతల ఇన్‌చార్జిగా ఎవరున్నారు? వీటిన్నింటికి సమాధానం ఎవరు చెబుతారు?” అని నడ్డా పరోక్షంగా మమతకు చురకలంటించారు.