నాగార్జున సాగర్ అభ్యర్థిగా డాక్టర్ రవినాయక్ పేరును భాజాపా సోమవారం ఖరారు చేసింది. టికేట్ కోసం అంజన్ యాదవ్, నివేదిత రెడ్డి, ఇంద్రాసేన రెడ్డి పోటిపడగా.. నియోజక వర్గంలోని సమీకరణాల దృష్ట్యా, తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని , బీజేపి అధిష్టానం రవి నాయక్ ను ఎంపిక చేసింది. త్రిపురారం మండల పలుగుతాండాకు చెందిన రవినాయక్, ప్రభుత్వ వైద్యుడిగా వివిధ మండలాల్లో విధులు నిర్వర్తించారు. గత ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రైవేట్ వైద్యశాలను నిర్వహిస్తూ, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత నెలలో జరిగిన బహిరంగ సభలో ఆయన బీజేపిలో చేరారు. రవినాయక్ సతీమణి సంతోష పలుగుతాండా సర్పంచ్‌గా ఉన్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు.